వెంకీ రవితేజ సినిమా లేనట్లే ఇక….!

రెండు రోజులుగా సోషల్ మీడియా లో వెంకటేష్ – రవితేజ కాంబినేషన్లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతోందని తెగ వైరల్ కావడం తో వెంకీ అభిమానులు..రవితేజ అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. కానీ ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని స్పష్టంమైంది. వీరు పోట్ల ఓ కథ వినిపించిన సంగతి నిజమే కానీ దానికి వెంకీ ఎలాంటి సమాధానం చెప్పలేదట. కానీ సోషల్ మీడియా లో మాత్రం వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని..రవితేజ మరో హీరో అని త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని ప్రచారం జరిగింది. ఈ ప్రచార నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ వార్త ఫై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వెంకీ..నా వెంకీమామ సినిమా చేస్తున్నాడు. బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published.

You may have missed