బిగ్ బాస్ 3 హోస్ట్ ..?

big boss three host

బిగ్ బాస్ మూడో సీజన్ కు సిద్ధం చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ , రెండో సీజన్ కు నాని లు హోస్ట్ గా వ్యవహరించి షో ను చాలా విజయవంతం చేసారు. ఇక మూడో సీజన్ ఎవరో హోస్ట్ గా వ్యవహరిస్తారనేది అని గత కొన్ని రోజులుగా చర్చ గా మారింది. హోస్ట్ గా చిరంజీవి , వెంకటేష్ , విజయ్ దేవరకొండ, కౌశల్ ల పేర్లు బయటకు రాగా ప్రస్తుతం మాత్రం నాగార్జున దగ్గర ఆగిపోయినట్లు తెలుస్తుంది.

గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షో కు నాగ్ హోస్ట్ గా నడిపించిన తీరు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా దగ్గర చేసింది. ఆ పోలిక రావడం వల్లే చిరంజీవి హోస్ట్ చేసిన సిరీస్ కు ఆ స్థాయి స్పందన దక్కలేదు. అందుకే బిగ్ బాస్ 3 కి నాగ్ ను ఫిక్స్ చేయాలనీ యాజమాన్యం ఫిక్స్ అయ్యిందట. నాగ్ సైతం ఒకే అన్నట్లు సమాచారం. జూన్ నుంచి ప్రారంభం కానున్న బిగ్ బాస్ 3 కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం.

Leave a Reply

Your email address will not be published.

You may have missed