ఒక్కప్పుడు సినిమా ఆర్టిస్ట్ ఇప్పుడు వాచ్ మెన్….!

బాలీవుడ్ కు చెందిన నటుడు సవి సిద్దు గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఒకప్పుడు మంచి నటుడిగా గుర్తింపు దక్కించుకున్న సవి సిద్దూ ఇప్పుడు వాచ్ మన్ గా పనిచేస్తున్నాడు. 2011వ సంవత్సరంలో అక్షయ్ కుమార్ నటించిన ఒక చిత్రంలో కీలక పాత్ర పోషించిన సవి సిద్దు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. సినిమాల్లో నటించిన అనుభవం ఉన్నా కూడా మంచి ఉద్యోగం దొరకక పోవడంతో పాటు ఆఫర్లు లేక పోవడం వల్ల సవి సిద్దూ వాచ్ మన్ గా కాలం వెళ్లదీస్తున్నాడు. సవి సిద్దు గురించి సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వైరల్ అవుతుండటంతో బాలీవుడ్ కు చెందిన పలువురు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.