మహర్షి డేట్ ఫిక్స్……!

mahesh maharshi movie release date

మహేష్ బాబు నటిస్తున్న తాజా మూవీ ‘మహర్షి’ విడుదల తేదీని చిత్ర యూనిట్ కన్ఫామ్ చేసుకుంది. సూపర్ స్టార్ మహేశ్ తన 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మద్యే మహర్షి మూవీ మూడో వంతు షూటింగ్ పూర్తి చేసుకుంది . అన్ని కంప్లీట్ చేసుకొని ఏప్రిల్ 25న ఏ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ మీడియా కి తెలిపింది .

ఈ చిత్రం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి ఉంటె ఏప్రిల్ 5నే ఈ చిత్రం విడుదల కావాల్సిఉండగా.. కొన్ని కారణాల వాళ్ళ ఏప్రిల్ 25కి వాయిదా పడింది. అయితే షూటింగ్‌ ఆలస్యం అవుతుండడం మల్లి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా చాలా రోజులు అవుతాయిలే కాబ్బటి ఏప్రిల్ లో విడుదల కష్టం అని వార్తలు వినిపించిన చిత్ర యూనిట్ ఈరోజు మహర్షి విడుదల తేదీలో ఎలాంటి మార్పులు లేవని ముందుగా ప్రకటించినట్టే ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్టు తెలిపింది మహర్షి సినిమా మొత్తం మార్చి 15 నాటికి షూటింగ్ కంప్లీట్ అవుతుందని.. రెండు సాంగ్స్‌ని పూర్తి చేయాల్సి ఉంది అవి త్వరగా కంప్లీట్ చేసి చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్ని యూనిట్ మొదలు చేస్తున్నట్టు తెలియజేసారు.

మహర్షి లో మహేష్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. అంతే గాక దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడం తో సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి . ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పథకం ఫై ఇంకా సహా నిర్మాతలు వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమాస్ బ్యానర్లపై అశ్వినీదత్, ప్రసాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

You may have missed