హీరో గా ఎంట్రీ ఇవ్వనున్న కీరవాణి కుమారుడు…!

సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు త్వరలో ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. కీరవాణికి ఇద్దరు కుమారులు.. పెద్ద కుమారుడు కాల భైరవ ఇప్పటికే సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని .. త్వరలో మ్యూజిక్ డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇదిలా ఉంటే కీరవాణి చిన్న కుమారుడు సింహా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు సింహా డెబ్యూ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం. ఈ మూవీతో నిశాంత్ అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు