నిరుత్సాహ పరిచిన టీజర్……ఇంకా కావాలి అంటున్న ఫాన్స్…!

vijay devarakonda new movie

డియర్‌ కామ్రెడ్‌ టీజర్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్‌కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ముద్దు సీన్‌ పెట్టడంతో టీజర్‌కు మంచి హైప్‌ వచ్చిందని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం ముద్దు సీన్‌ తప్ప మరేం లేదు అంటూ నిటూర్చుతున్నారు.

మొత్తానికి విజయ్‌ దేవరకొండ భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న డియర్‌ కామ్రెడ్‌ సినిమా టీజర్‌ విషయంలో కొందరు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరో టీజర్‌ వచ్చే అవకాశం ఏమైనా ఉందేమో చూడాలి. సినిమాను మే చివరి వారంలో విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారు. అంటే సినిమాకు ఇంకా రెండున్నర నెలల సమయం ఉంది. కనుక అప్పటి వరకు మరో టీజర్‌ తో లేదా ట్రైలర్‌తో సినిమాను అమాంతం పైకి ఎత్తే అవకాశం లేకపోలేదు. దేవరకొండ మూవీకి ఏదైనా సాధ్యమే అని ఆయన గత సినిమాలను బట్టి అర్ధం చేసుకోవచ్చు

Leave a Reply

Your email address will not be published.

You may have missed