ఏడు గంటల సినిమా….!

made in heaven amazon prime

ఉమెన్స్ డే సందర్భంగా అమెజాన్ ప్రైమ్ మేడ్ ఇన్ హెవెన్ పేరుతో ఓ కొత్త వెబ్ సిరీస్ ని నిన్న రిలీజ్ చేసింది. ఈ సిరీస్ నిడివి 7 గంటల 30 నిముషాలు ఈవెబ్ సిరీస్ మొత్తం తొమ్మిది ఎపిసోడ్లు. మీరు ఈ సినిమా చూడాలి అంటే ఇంట్లోనో ల్యాప్ టాప్ లోనో లేదా స్మార్ట్ ఫోన్ లోనో అంత సమయం ఖర్చు పెట్టాల్సిందే.

ఇక మెడ్ ఇన్ హెవెన్ కథ విషయానికి వస్తే ఖరీదైన ఢిల్లీ ప్రాంతంలో ధనవంతుల పిల్లలకు ఖరీదైన పెళ్లిళ్లు చేయించే వెడ్డింగ్ ప్లానర్స్ గా ఉంటారు తారా ఖన్నా(శోభిత)కరణ్ మెహరా(అర్జున్). పైకి డాంబికాలు కోసం అప్పు చేసి మరీ కోట్లలో ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేసే అల్ట్రా రిచ్ ధనవంతులు వీళ్ళ టార్గెట్. ఈ క్రమంలో ఇద్దరికీ ఎన్నో విచిత్రమైన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు తారసపడతారు. పైకి అన్యోన్యంగా కనిపించినా అర్జున్ తారల మధ్యే తీవ్రమైన విభేదాలు ఉంటాయి. వీరి జంట ప్రయాణం ఎలా సాగింది అనేదే మేడ్ ఇన్ హెవెన్.

చాలా బోల్డ్ గా సాగిన ఈ అటెంప్ట్ కాస్త ఓపికగా చూస్తే నచ్చేలాగే ఉంటుంది. సినిమాకు ఏ మాత్రం తీసిపోని మేకింగ్ క్వాలిటీతో అమెజాన్ ఖర్చు పెట్టిన విధానం ఔరా అనిపిస్తుంది. మనకు పెద్దగా పరిచయం లేని రిచ్ ఫ్యామిలీస్ ఫాల్స్ స్ట్రాటజీ వెనుక చీకటి కోణాలను ఎమోషనల్ టచ్ తో చూడాలి అంటే మేడ్ ఇన్ హెవెన్ మీద ఓ లుక్ వేయొచ్చు… ఇందులో విశేషం ఏంటంటే అడవి శేష్ గూడచారితో పరిచయమైన శోభిత ధూళిపాళ ఇందులో లీడ్ ఫిమేల్ రోల్ పోషించింది. అర్జున్ మాథుర్ తనకు జంటగా నటించాడు…
ఈ సినిమా లో అందరికి గుర్తుండిపోయేలా చేసింది మాత్రం మన తెలుగమ్మాయి శోబితనే. గల్లీ బాయ్ దర్శకుడు జోయా అక్తర్ తో పాటు రీమా కత్జీ దీనికి జంట దర్శకత్వం వహించారు.

Leave a Reply

Your email address will not be published.

You may have missed